దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... రేపు సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం

భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పాజిటివ్ కేసులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ రేపు సమావేశం కానున్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత, దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రజంటేషన్ ఇస్తారు. అనంతరం, సీఎంలు తమ పరిధిలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరిస్తారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత స్థితిగతులపై మోదీ సీఎంలకు దిశానిర్దేశం చేస్తారు.

PM Modi
Chief Ministers
COVID19
Positivity Rate
India

More Telugu News