ఒకే మ్యాచ్ లో నాలుగు ఘనతలు సాధించిన ధావన్!
- ఐపీఎల్ లో 6 వేలకు పైగా పరుగులు సాధించిన ధావన్
- ఈ టోర్నీలో 200 మ్యాచ్ లు ఆడిన ఘనత
- మొత్తం టీ20 క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న ధావన్
మరోవైపు నిన్న జరిగిన మ్యాచ్ ధావన్ కు 200వ ఐపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం. ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్ మెన్ గా ధావన్ నిలిచాడు. అంతేకాదు ఇదే మ్యాచ్ లో కోహ్లీ పేరిట ఉన్న మరో రికార్డును ధావన్ అధిగమించాడు. ధావన్ 9 పరుగులు సాధించిన తర్వాత చెన్నై జట్టుపై ఎక్కువ పరుగులు (1,022) చేసిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. చెన్నైపై 949 పరుగులు చేసిన కోహ్లీ రెండో స్థానానికి వెళ్లాడు. అంతేకాదు మొత్తం టీ20 క్రికెట్లో ధావన్ 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.