Taneti Vanita: తాజా మాజీ మంత్రితో ఏపీ హోం శాఖ‌ మంత్రి భేటీ

ap home minister taneti vanita meets ex minister sucharitha
  • మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో ప‌దవి కోల్పోయిన సుచరిత‌
  • ప్ర‌మోష‌న్‌తో హోం శాఖ ప‌గ్గాలు చేప‌ట్టిన తానేటి వ‌నిత‌
  • సుచరిత ఇంటికెళ్లి ఆమెతో భేటీ అయిన వ‌నిత‌
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి సంబంధించి సోమ‌వారం ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య భేటీ జ‌రిగింది. ఇటీవ‌లే జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా అప్ప‌టిదాకా హోం శాఖ మంత్రిగా ప‌నిచేసిన మేక‌తోటి సుచ‌రిత మంత్రి ప‌ద‌విని కోల్పోయారు. అదే స‌మ‌యంలో పాత మంత్రివ‌ర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొన‌సాగిన తానేటి వ‌నిత మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత ప్ర‌మోష‌న్ ద‌క్కించుకుని హోం శాఖ మంత్రిగా కొత్త బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఈ క్ర‌మంలో త‌న‌ను మంత్రిగా కొన‌సాగించ‌ని వైనంపై పార్టీ అధిష్ఠానంపై అల‌క‌బూనిని సుచ‌రిత‌... ఏకంగా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌న్న రీతిగా సాగారు. అయితే సీఎం జ‌గ‌న్ నుంచి పిలుపు రాగానే... ఆయ‌న‌తో భేటీ అయిన త‌ర్వాత త‌న‌కేమీ అసంతృప్తి లేద‌ని సుచ‌రిత ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం హోం శాఖ కొత్త మంత్రి తానేటి వ‌నిత.. గుంటూరులోని బ్రాడీపేట‌లో ఉన్న సుచరిత ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఇద్దరు నేత‌లు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.
Taneti Vanita
Mekathoti Sucharitha
AP Home Minister
YSRCP

More Telugu News