Andhra Pradesh: సీపీఎస్‌పై క‌మిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్ర‌భుత్వం

ap government appoints five member committe on cps
  • ముగ్గురు మంత్రులతో కూడిన క‌మిటీ
  • క‌మిటీలో స‌జ్జ‌ల‌, సీఎస్‌ల‌కు చోటు
  • ఉద్యోగ సంఘాల‌తో ఈ క‌మిటీ చ‌ర్చ‌లు
  • స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌భుత్వానికి నివేదిక‌
ఉద్యోగులు, ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య న‌లుగుతున్న కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం (సీపీఎస్‌) ర‌ద్దుకు సంబంధించిన వ్య‌వ‌హారంపై ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చ‌ల‌కు కాస్తంత ముందుగా ఏపీ ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మంత్రులు, అధికారుల‌తో కూడిన ఐదుగురు స‌భ్యుల క‌మిటీని జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌క‌టించింది. 

మంత్రులు బొత్స స‌త్యనారాయ‌ణ‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, ఆదిమూల‌పు సురేశ్‌ల‌తో పాటు ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ ఈ క‌మిటీలో స‌భ్యులుగా ఉంటారు. ఈ క‌మిటీయే ఉద్యోగ సంఘాలతో చ‌ర్చ‌ల్లో పాలుపంచుకుంటుంది. ఆపై ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి సంబంధించి ప‌లు సూచ‌న‌ల‌తో కూడిన నివేదికను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించ‌నుంది.
Andhra Pradesh
CPS
Emloyees Organisations

More Telugu News