Allu Arjun: ' పుష్ప 2' కోసం దిగిపోతున్న మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్!

Pushpa 2 movie update
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ 'పుష్ప 2'ను రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫస్టు పార్టుతో పాటు సెకండ్ పార్టులోను ఫారెస్ట్ ఆఫీసర్ గా ఫహాద్ ఫాజిల్ కనిపించనున్న సంగతి తెలిసిందే. 

ఇక సెకండు పార్టులో మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరో సీనియర్ స్టార్ హీరోను దింపుతున్నారట. ఆ సీనియర్ స్టార్ హీరో ఎవరో కాదు .. సునీల్ శెట్టి. బాలీవుడ్లో ఒకప్పుడు యాక్షన్  సినిమాలు ఎక్కువగా చేసిన సునీల్ శెట్టి, ఈ మధ్య కాలంలో తెలుగులో ముఖ్యమైన రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన 'గని' సినిమాలోనూ ఆయన కనిపించారు. 

ఇక ఇప్పుడు 'పుష్ప 2' కోసం కూడా ఆయన ఎంపిక జరిగిందని అంటున్నారు. ఈ పాత్రను సుకుమార్ డిఫరెంట్ గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాలోని బలమైన పాత్రల్లో ఇదొకటని సమాచారం. రష్మిక కథానాయికగా నటించే ఈ సినిమాలో, దిశా పటాని కూడా మెరవనుంది. స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకున్నారని అంటున్నారు.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa 2 Movie

More Telugu News