తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ
- మొత్తం పోస్టుల సంఖ్య 16,027
- అందులో ఎస్సై పోస్టులు 414
- మే 2 నుంచి 20 వరకు దరఖాస్తులు
ప్రస్తుతం తెలంగాణ పోలీసు శాఖలో కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల సంఖ్య 16,027గా నిర్ధారిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు ఇదివరకే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మే నెల 2 నుంచి 20 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం అభ్యర్థులు www.tslprb.inను సంప్రదించవచ్చు.
ఆయా విభాగాల్లో ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్సై పోస్టులు: 414
సివిల్ కానిస్టేబుల్ పోస్టులు: 4,965
టీఎస్‌పీఎస్సీ బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టులు: 5,010
ఏఆర్ కానిస్టేబుల్స్: 4,423
స్పెషల్ పోలీస్ పోస్టులు: 390
ఫైర్ విభాగంలో పోస్టులు: 610
డ్రైవర్ పోస్టులు: 100