Vidadala Rajini: స్వరూపానందస్వామి ఆశీస్సులు తీసుకున్న విడదల రజని.. వీడియో ఇదిగో!

Vidadala Rajani takes blessings of Swaroopananda swamy
  • మంత్రి అయిన తర్వాత తొలిసారి స్వరూపానంద పీఠానికి వచ్చిన విడదల రజని
  • పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న మంత్రి
  • రజనికి చీరను బహూకరించిన స్వరూపానంద
విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను ఏపీ మంత్రి విడదల రజని తీసుకున్నారు. విశాఖలోని శారదాపీఠానికి వెళ్లిన ఆమె స్వరూపానంద పాదాలకు నమస్కరించారు. విడదల రజని మంత్రి పదవిని చేపట్టిన తర్వాత స్వరూపానంద ఆశీర్వాదాలు తీసుకోవడం ఇదే తొలిసారి. 

ఈ సందర్భంగా ఆమెతో స్వరూపానంద కాసేపు ముచ్చటించారు. బాగున్నారా? అని స్వరూపానంద ప్రశ్నించగా... మీ ఆశీర్వాదాల వల్ల జగనన్న బాగుంటే... తామందరం బాగుంటామని ఆమె చెప్పారు. ఆ తర్వాత రజనికి స్వరూపానంద చీరను బహూకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు మరో మంత్రి రోజా కూడా స్వరూపానంద ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి తెలిసిందే. 
Vidadala Rajini
YSRCP
Swaroopanandendra Saraswati

More Telugu News