Andhra Pradesh: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

Three dead and 9 injured in an accident in Srikalahasti
  • కనువూరమ్మ ఆలయాన్ని దర్శించుకుని వస్తుండగా ఘటన
  • టెంపోను ఢీకొన్న లారీ
  • గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతిలోని చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ ఆలయాన్ని దర్శించుకుని టెంపోలో తిరిగి తిరుపతికి బయలుదేరారు. ఈ క్రమంలో రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారిపై శ్రీకాళహస్తి అర్ధనారీశ్వరస్వామి ఆలయం సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. 

ఈ ఘటనలో అర్జునయ్య, నరసమ్మ దంపతులతోపాటు కావ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గోపి, ఢిల్లీ రాణి, కవిత, ఆనంద్, శ్రీనివాసులుతోపాటు నలుగురు చిన్నారులు భవీఫ్, ధరణి, మోక్షిత, ధనుష్ గాయపడ్డారు. వీరిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Tirupati
Road Accident
Srikalahasti

More Telugu News