Cricket: టీమిండియాలోకి తిరిగి వస్తానని అనుకోవట్లేదు.. దాని గురించి ఆలోచించడం లేదు: హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్లు

  • ప్రస్తుతానికి ఐపీఎల్ పైనే నా ఫోకస్
  • నేను ఆడుతున్న జట్టు గురించే ఆలోచన
  • భవిష్యత్ ఎలా ఉంటుందో చూద్దాం
  • అది తన చేతుల్లో లేదని కామెంట్
Hardik Shocking Comments On Re Entry Into Team India

కొత్త జట్టే అయినా.. ప్రత్యర్థులకు గుజరాత్ టైటాన్స్ చుక్కలు చూపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తూ వరుస విజయాలను నమోదు చేస్తోంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ట్రోఫీ రేసులో ముందంజలో నిలిచింది. అయితే, హార్దిక్ ను ముంబై వదిలేసుకున్నా.. గుజరాత్ యాజమాన్యం మాత్రం అతడిపై నమ్మకం ఉంచి తీసుకుంది. జట్టుకు కెప్టెన్ నూ చేసింది. 

ఆ నమ్మకాన్ని హార్దిక్ వమ్ము చేయలేదు. కెప్టెన్ గా, బ్యాటర్ గా, ఆల్ రౌండర్ గా విలువైన సేవలందిస్తున్నాడు. జట్టు గెలుపులో కీలకమవుతున్నాడు. ఈ క్రమంలోనే విమర్శకుల నోళ్లకు తాళం వేసేశాడు. టీమిండియాలోకి పునరాగమనంపై ఆశలు పెంచేశాడు. ఇదే విషయంపై అతడూ తాజాగా స్పందించాడు. 

జట్టులో చోటు గురించి ఆలోచించడం కంటే ప్రస్తుత టైంపైనే తాను దృష్టి పెట్టానని హార్దిక్ చెప్పాడు. ‘‘నేను జట్టులోకి తిరిగి వస్తున్నానని అనుకోవట్లేదు. ఇంకోటి దాని గురించి నేను అస్సలు ఆలోచించడం లేదు. ప్రస్తుతం నేను ఆడే గేమ్ పైనే నేను దృష్టి పెడుతున్నా’’ అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం తాను ఐపీఎల్ లో ఆడుతున్నాను కాబట్టి.. ఐపీఎల్ పైనే తన ఫోకస్ ఉంటుందన్నాడు. ఆ తర్వాత తన భవిష్యత్ ఎక్కడికెళుతుందో వేచి చూడాల్సిందేనని, అది తన చేతుల్లో లేదని వ్యాఖ్యానించాడు. 

ప్రస్తుతానికైతే తాను ఆడుతున్న జట్టు కోసం మాత్రమే తన దృష్టిని కేంద్రీకరిస్తానని పేర్కొన్నాడు. ఆటతీరు పరంగా చాలా సంతృప్తిగా ఉన్నానని వ్యాఖ్యానించాడు. తన ఆట మెరుగవ్వడంలో కెప్టెన్సీ ఎంతో ఉపకరించిందని వివరించాడు. బాధ్యతలను తీసుకునేందుకు ఇష్టపడే క్రికెటర్ నని తెలిపాడు. ఆటను బాగా అర్థం చేసుకున్నప్పుడే విజయం సాధించగలుగుతామని హార్దిక్ చెప్పాడు.  

More Telugu News