Jogi Ramesh: చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు: జోగి రమేశ్

Chandrababu has no tight to speak about women says Jogi Ramesh
  • విజయవాడ ఆసుపత్రిలో జరిగిన ఘటన దురదృష్టకరం
  • శవ రాజకీయాలు చేయడానికే చంద్రబాబు ఆసుపత్రి వద్దకు వచ్చారు
  • వాసిరెడ్డి పద్మపై కాల్ మనీ నేతలే దాడి చేశారు
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటన దురదృష్టకరమని మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించారని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయడమే కాక, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. బాధితురాలి ఆరోగ్యం మెరుగయ్యేంత వరకు ప్రభుత్వం వైద్యం అందిస్తుందని చెప్పారు.

 టీడీపీ అధినేత చంద్రబాబు శవ రాజకీయాలు చేసేందుకే ఆసుపత్రికి వచ్చారని విమర్శించారు. అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వేసే సమయంలో కావాలనే చంద్రబాబు హడావుడి చేశారని మండిపడ్డారు. మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మపై కాల్ మనీ సెక్స్ రాకెట్ నేతలే దాడి చేశారని చెప్పారు. చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఇకపై మహిళలపై ఈ తరహా ఘటనలు ఎక్కడ జరిగినా ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు.
Jogi Ramesh
Vasireddy Padma
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News