Errabelli: రైతుల కోసం పాటుపడింది ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే: రేవంత్ పై ఎర్రబెల్లి విమర్శనాస్త్రాలు

Errabelli replies to Revanth Reddy comments on TRS leaders
  • టీఆర్ఎస్ పై రేవంత్ వ్యాఖ్యలు.. ఎర్రబెల్లి కౌంటర్ 
  •  కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ని గౌరవించేవాళ్లు ఉన్నారా? అన్న ఎర్రబెల్లి
  • రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమేనని వ్యాఖ్య  
  • ఇప్పుడు కాంగ్రెస్ జీరోగా ఎలా మారిందో గమనించాలన్న ఎర్రబెల్లి 
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. అసలు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని గౌరవించేవాళ్లు కూడా ఉన్నారా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. పార్టీలో ఒక్క సీనియర్ నేత అయినా రేవంత్ రెడ్డి మంచివాడు అని చెప్పగలరా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జీరోగా ఎలా మారిందో గమనించాలని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు ఏం మేలు జరిగిందని నిలదీశారు. రైతుల కోసం కృషి చేసింది ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని ఎర్రబెల్లి ఉద్ఘాటించారు. రేవంత్ రెడ్డి భాష, తీరు మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ వేళ చంద్రబాబు ఏజెంట్ గా రేవంత్ పనిచేసిన సంగతి తెలుసని అన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. రాహుల్ రాక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభాస్థలిని పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై వ్యాఖ్యలు చేశారు.
Errabelli
Revanth Reddy
NTR
KCR
Farmers
TRS
Congress
Telangana

More Telugu News