Vidadala Rajini: మీ హ‌యాంలో ఘోరాలు మ‌రిచారా?.. చంద్ర‌బాబుపై మంత్రి విడ‌ద‌ల ర‌జని ఫైర్‌

ap minister vidadala rajini comments on chandrababu
  • బెజ‌వాడ ఆసుప‌త్రిలో అత్యాచారంపై స్పందించిన ర‌జ‌ని 
  • ఘ‌ట‌న‌ను చంద్ర‌బాబు రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌
  • బాధితురాలికి అండ‌గా ఉంటామ‌న్న మంత్రి 
విజ‌య‌వాడ ఆసుప‌త్రిలో యువ‌తిపై అత్యాచార ఘ‌ట‌న రాజ‌కీయ రంగు పులుముకుంది. బాధితురాలి ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన సంద‌ర్భంగా ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ పర్సన్, విప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడుల మ‌ధ్య బాధితుల స‌మ‌క్షంలోనే తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జ‌రిగిన ఘ‌ట‌న‌పై వైసీపీ నేత‌లు ఘాటుగా స్పందిస్తున్నారు. 

మ‌హిళా క‌మిష‌న్ చైర్ పర్సన్ హోదాలో వెళ్లిన వాసిరెడ్డి ప‌ద్మ‌పై చంద్ర‌బాబు త‌దిత‌రులు దాడికి పాల్ప‌డ్డారంటూ వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని ఘాటుగా స్పందించారు.

టీడీపీ హ‌యాంలో జ‌రిగిన ఘోరాల‌ను మ‌రిచారా? అంటూ ప్రశ్నించిన ర‌జ‌ని.. అత్యాచార ఘ‌ట‌న‌పై త‌మ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించింద‌ని చెప్పారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉంటామని, బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని చెప్పుకొచ్చారు. ఈ ఘ‌ట‌న‌ను చంద్ర‌బాబు రాజ‌కీయం చేస్తున్నార‌ని మంత్రి ఆరోపించారు.
Vidadala Rajini
YSRCP
Rape
Chandrababu

More Telugu News