iPhone: నూడ్ ఫొటోలు షేర్ చేస్తే బ్లర్.. ఐఫోన్ లో కొత్త ఫీచర్

  • మెస్సేజింగ్ యాప్ లో ప్రాథమిక రక్షణ
  • అసభ్య ఫొటోలు చూసేందుకు ప్రయత్నిస్తే హెచ్చరిక
  • ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ లో అందుబాటులోకి
iPhone feature that blurs nude photos in Messages app now rolling out globally

కమ్యూనిటీ సేఫ్టీ ఫీచర్ ను యాపిల్ మరిన్ని మార్కెట్లలోకి తీసుకొస్తోంది. గత డిసెంబర్ లో దీన్ని అమెరికాలో ఆవిష్కరించడం గమనార్హం. మెస్సేజెస్ యాప్ లో నూడ్ గా ఉన్న ఫొటోలను షేర్ చేస్తే వాటిని బ్లర్ చేయడం దీని ప్రత్యేకత. ఈ ఫీచర్ ఇప్పుడు బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ లోని ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. సమీప భవిష్యత్తులో ఇతర మార్కెట్లలోని యూజర్లకు సైతం ఇది అందుబాటులోకి రానుంది.


పిల్లలు వాడే ఐఫోన్ లో పెద్దలు ఈ ఫీచర్ ను ఆప్ట్ ఇన్ చేసుకుంటే నూడ్ ఫొటోలు చూడకుండా అడ్డుకోవచ్చు. అయితే ఇది కొంత వరకే. నూడ్ ఫొటోలు నేరుగా కనిపించవు. కానీ, వాటిని చూడాలనుకుంటే యూజర్లు ట్యాప్ చేయవచ్చు. అప్పుడు ‘ఈ ఫొటో సున్నితమైనది. అయినా మీరు చూడాలని అనుకుంటున్నారా’ అన్న హెచ్చరిక కనిపిస్తుంది. ఐయామ్ ష్యూర్ అని సెలక్ట్ చేసుకుని ముందుకు వెళితే ఆ ఫొటో బ్లర్ లేకుండా అసలు రూపంలోనే కనిపిస్తుంది. 

మెషిన్ లర్నింగ్ సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ రక్షణ ఉంటుందని, షేర్ చేసుకునే యూజర్లు మినహా కంటెంట్ మరెవరూ చూడడం సాధ్యపడదని యాపిల్ పేర్కొంది. పిల్లలు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తుంటే పెద్దలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

More Telugu News