విమానంలో యువకుడి ముఖంపై పిడిగుద్దులు కురిపించిన మైక్ టైసన్.. వీడియో ఇదిగో
- అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడాకు టైసన్
- జెట్ బ్లూ ఎయిర్‌లైన్ విమానంలో ఉండగా ఘటన
- ఓ యువకుడు పదే పదే మాట్లాడుతుండడంతో టైసన్‌కు ఆగ్రహం
ఆ యువకుడు అలాగే వాగుతూ ఉండడంతో మైక్ టైసన్ ఆగ్రహంతో ఊగిపోతూ అతడి వద్దకు వెళ్లి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీంతో ఆ యువకుడి ముఖానికి గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు టైసన్‌ను శాంతింపజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.