బారాముల్లాలో ఎన్కౌంటర్.. లష్కరే అగ్ర కమాండర్ హతం
- లష్కరే కమాండర్ కంత్రూతోపాటు మరో ఇద్దరి హతం
- పలువురి హత్యలో కంత్రూ పాత్ర
- ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లకు గాయాలు
ఈ ఘటనలో లష్కరే తోయిబా అగ్ర కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రత్యేక పోలీసు అధికారి, అతడి సోదరుడు, ఓ జవాను సహా పలువురు పౌరుల హత్యల్లో కంత్రూ ప్రమేయం ఉన్నట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు ఆయన పేర్కొన్నారు.