Vladimir Putin: మేరియుపోల్ ను వశం చేసుకున్న రష్యా... సైన్యాన్ని అభినందించిన పుతిన్

Russia captures Mariupol
  • మేరియుపోల్ వశమైనట్టు ప్రకటించిన పుతిన్
  • ఇది చాలా గొప్ప విషయమన్న రష్యా అధ్యక్షుడు
  • మేరియుపోల్ ను కైవసం చేసుకోవడం రష్యాకు అత్యంత కీలకం
ఉక్రెయిన్ కీలక నగరాల్లో ఒకటైన మేరియుపోల్ పూర్తి స్థాయిలో తమ వశమైనట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఆ నగరానికి విముక్తి లభించిందని పుతిన్ చెప్పారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన భేటీలో మాట్లాడుతూ, మేరియుపోల్ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడం గొప్ప విషయమని అన్నారు. మిమ్మల్నందరినీ అభినందిస్తున్నానని చెప్పారు. ఇక ఆ ప్రాంతంపై దాడులు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. 

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటి నుంచి మేరియుపోల్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం రష్యాకు అత్యంత కీలకం. ఎందుకంటే రష్యా ఆక్రమించిన క్రిమియాకు, రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన డాన్ బాస్ కు మధ్యలో మేరియుపోల్ ఉంది. ఇప్పుడు మేరియుపోల్ రష్యా వశం కావడంతో... క్రిమియా, డాన్ బాస్ మధ్య భూమార్గంలో రాకపోకలకు రష్యాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Vladimir Putin
Russia
Ukraine
Mariupol

More Telugu News