మహబూబాబాద్ లో మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్య

తెలంగాణలోని మహబూబాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పత్తిపాకలో 8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవిపై ఆగంతుకులు గొడ్డలితో దాడి చేశారు. రోడ్డు పక్కన రవి నిలబడి ఉండగా దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న రవిని అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News