దినేశ్ కార్తీక్ ఆట‌తీరుపై ఏబీ డివిలియ‌ర్స్ ప్ర‌శంస‌ల జ‌ల్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దినేశ్ కార్తీక్ ఆట‌తీరుపై ఏబీ డివిలియ‌ర్స్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

ab de villiers praises karthik
  • కార్తీక్‌ బ్యాటింగ్ తీరు ఇంత బాగా ఉంటుంద‌ని తాను ఊహించలేదన్న డివిలియ‌ర్స్ 
  • అత‌డు ఆడుతోన్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంద‌ని వ్యాఖ్య‌
  • కార్తీక్  సత్తా ఉన్న ఆటగాడని త‌నకు ముందే తెలుసన్న డివిలియ‌ర్స్
ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తోన్న‌ బెంగళూరు జ‌ట్టు ఆట‌గాడు దినేశ్‌ కార్తీక్ పై ఆ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. అత‌డి బ్యాటింగ్ తీరు ఇంత బాగా ఉంటుంద‌ని తాను ఊహించలేదని అన్నాడు. అత‌డు ఆడుతోన్న తీరు త‌న‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంద‌ని చెప్పాడు. కార్తీక్  సత్తా ఉన్న ఆటగాడని త‌నకు ముందే తెలుసని అన్నాడు. ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లోనూ కార్తీక్ రాణించాలనుకుంటాడని చెప్పాడు. 

ఈ ఐపీఎల్‌కు ముందు చివరిసారి దినేశ్ కార్తీక్‌ను ఇంగ్లాండ్‌లో కామెంట్రీ చేసినప్పుడు చూశాన‌ని అన్నాడు. అత‌డు దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువగా ఆడలేకపోతుండటంతో కెరీర్‌ ముగింపు దశకు వచ్చిందని అనుకున్నాన‌ని చెప్పాడు. కార్తీక్‌లో పరుగులు చేయాలన్న కసి, పట్టుదల ఉన్నాయ‌ని, దీంతో బాగా ఆడుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడ‌ని తెలిపాడు. 

de villiers
ipl
Cricket

More Telugu News