బంగ్లాదేశ్ క్రికెట్లో తీవ్ర విషాదం... బ్రెయిన్ ట్యూమర్ తో ఇద్దరు మాజీ ఆటగాళ్ల మృతి
- బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతన్న సమియుర్, మొషారఫ్
- చికిత్స పొందుతూ కన్నుమూత
- ఇద్దరూ ఒకేరోజు ప్రాణాలు విడిచిన వైనం
40 ఏళ్ల మొషారఫ్ హుస్సేన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా సేవలు అందించాడు. జాతీయ జట్టులో పెద్దగా రాణించని మొషారఫ్... దేశవాళీ క్రికెట్లో మాత్రం పెద్ద స్టార్ గా పేరుగాంచాడు. దేశవాళీ పోటీల్లో ఏకంగా 572 వికెట్లు పడగొట్టాడు. సమియుర్, మొషారఫ్ వంటి మాజీలను కోల్పోవడం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.