Vdivelu: స్టార్ హీరోలకు నో చెప్పిన ప్రభుదేవా .. వడివేలు కోసం రంగంలోకి దిగాడు!

  • 'నాయ్ శేఖర్'గా వడివేలు 
  • హాస్యప్రధానంగా సాగే కథ
  • డాన్స్ మాస్టర్ గా ప్రభుదేవా 
  • దర్శకుడిగా సూరజ్  
Naayi Sekhar Movie

తమిళంలో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన 'వడివేలు' గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. చిన్నపాటి కమెడియన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన, ఆ తరువాత హీరో స్థాయికి ఎదిగారు. తమిళంలో ఆయన పాత్రలకి ఇక్కడ ఎక్కువగా బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పేవారు. వడివేలు ఇక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి అది కూడా ఓ కారణమే!  

అలాంటి వడివేలు బాగా పాప్యులారిటీ వచ్చిన తరువాత రాజకీయాల్లో కుదురుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో స్టార్ హీరోలపై ఆయన చేసిన విమర్శలు సినిమాల్లో అవకాశాలు లేకుండా చేశాయి. వడివేలు కళ్లు తెరిచేసరికి చాలా ఆలస్యమైపోయింది.  ఇప్పుడు ఆయన హీరోగా 'నాయ్ శేఖర్' అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకి సూరజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కామెడీ టచ్ తోనే ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలోని ఒక పాటకి ప్రభుదేవా కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. డాన్స్ మాస్టర్ గా చేయడానికి స్టార్ హీరోలకే నో చెబుతూ వస్తున్న ప్రభుదేవా, వడివేలుతో ఉన్న సాన్నిహిత్యంతోనే అంగీకరించాడని అంటున్నారు.

More Telugu News