ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో ఇంట విషాదం.. అప్పుడే పుట్టిన కవలల్లో ఒకరి మృతి

Cristiano Ronaldos Newborn Boy Dies
  • అభిమానులతో ఆవేదన పంచుకున్న రొనాల్డో
  • పాప బతికి ఉండడంతో ఒకటే తమకు సంతోషాన్ని ఇస్తోందన్న స్టార్ ఆటగాడు
  • గోప్యతకు భంగం కలిగించొద్దని అభ్యర్థన
ఫుట్‌బాల్ దిగ్గజం, మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో ఇంట్లో విషాదం నెలకొంది. రొనాల్డో-జార్జినా రోడ్రిగ్జ్ జంటకు అప్పుడే పుట్టిన కవలల్లో ఒకరు మృతి చెందారు. రొనాల్డో ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలుపుతూ తన ఆవేదనను పంచుకున్నాడు. అప్పుడే పుట్టిన తమ బాబు చనిపోయిన విషయాన్ని పంచుకుంటున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నాడు. ఇది భరించలేని విషాదమని, అయితే పాప బతికి ఉన్న విషయం ఒక్కటే ఇప్పుడు తమకు ఆనందాన్ని, ఆశను ఇస్తోందని పేర్కొన్నాడు. 

ఈ కష్టకాలంలో తమ వెన్నంటి ఉన్న వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. అలాగే, తమ గోప్యతకు భంగం కలిగించవద్దని కోరాడు. కాగా, రొనాల్డో జంటకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. తమకు కవలలు జన్మించబోతున్నట్టు గతేడాది అక్టోబరులో ఈ జంట ప్రకటించింది.
Go Back to Shorts
Cristiano Ronaldos
Georgina Rodriguez
Manchester United
Football

More Telugu News