Nani: 'అంటే .. సుందరానికీ' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

  • నాని నుంచి మరో విభిన్న చిత్రం 
  • కథానాయికగా నజ్రియా పరిచయం
  • ఈ నెల 20వ తేదీన టీజర్ రిలీజ్ 
  • జూన్ 10వ తేదీన సినిమా రిలీజ్
Ante Sundaraniki movie update

ఈ మధ్య కాలంలో నాని సినిమాకి ..  సినిమాకి తన లుక్స్ ను మార్చేస్తున్నాడు. 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో డీసెంట్ లుక్ తో ఆకట్టుకున్న ఆయన, ఆ తరువాత చేసిన 'అంటే .. సుందరానికీ' సినిమాలోను మరింత డిఫరెంట్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన ఆచార .. సంప్రదాయాలను పాటించే బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. నాని సరసన నాయికగా నజ్రియా అలరించనుంది. గ్రామీణ నేపథ్యంలో అమాయకమైన యువకుడిగా నాని నటిస్తే, విదేశాలకి చెందిన మోడ్రన్ గాళ్ గా నజ్రియా ఆకట్టుకోనుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేవడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. జూన్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News