KGF 2: 'బాహుబలి 2' రికార్డును బద్దలు కొట్టిన 'కేజీఎఫ్ 2'

  • హిందీ బాక్సాఫీసును కొల్లగొడుతున్న 'కేజీఎఫ్ 2'
  • ఐదు రోజుల్లో రూ. 200 కోట్లు వసూలు చేసిన వైనం
  • రూ. 200 కోట్లు సాధించడానికి ఆరు రోజులు తీసుకున్న 'బాహుబలి 2'
KGF 2 breaks Bahubali 2 records

కన్నడ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'కేజీఎఫ్ 2' సినీ పరిశ్రమ రికార్డులను బద్దలు కొడుతోంది. బాలీవుడ్ లో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. హిందీలో ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం ఐదు రోజుల్లోనే హిందీలో రూ. 200 కోట్లు కొల్లగొట్టింది. రూ. 200 కోట్లను వసూలు చేయడానికి 'బాహుబలి 2'కి ఆరు రోజులు పట్టింది. ఈ నేపథ్యంలో, అతి తక్కువ రోజుల్లో హిందీలో రూ. 200 కోట్లు వసూలు చేసిన చిత్రంగా 'కేజీఎఫ్ 2' రికార్డు పుటల్లోకి ఎక్కింది. 

తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 28 కోట్లకు పైగా వసూలు చేసింది. నిన్న రూ. 5.55 కోట్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలను పోషించారు.

More Telugu News