Realme GT Neo 3: 150 వాట్ చార్జింగ్ తో వస్తున్న రియల్ మీ జీటీ నియో 3

  • ఇప్పటికే చైనాలో విడుదలైన మొబైల్   
  • భారత మార్కెట్లో ఈ నెల 29న విడుదల
  • రెండు వేరియంట్లలో అందుబాటులోకి
Realme GT Neo 3 India launch date announced

రియల్ మీ జీటీ నియో 3 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో ఈ నెల 29న విడుదల కానుంది. రియల్ మీ భారత్ హెడ్ మాధవ్ సేత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఫోన్  కొన్ని రోజుల క్రితమే చైనా మార్కెట్లో విడుదలైంది. 150 వాట్ చార్జింగ్ తో వస్తున్న తొలి ఫోన్ ఇదే కానుంది.

చైనాలో రెండు వేరియంట్లలో ఇది విడుదలైంది. అందులో ఒకటి 150 వాట్ చార్జింగ్ తో ఉంటుంది. 20 నిమిషాల్లోనే ఫోన్ చార్జింగ్ 100 శాతం పూర్తవుతుంది. మరొక వేరియంట్ 80 వాట్ చార్జింగ్ తో వస్తుంది. ఇది 30 నిమిషాల్లో చార్జింగ్ పూర్తి చేస్తుంది. ఇవే చార్జింగ్ సామర్థ్యాలు త్వరలో విడుదల కానున్న వన్ ప్లస్ 10ఆర్ లోనూ ఉండనున్నాయి. వీటి ధరలు చైనాలో రూ.24,000, రూ.33,000 చొప్పున ఉన్నాయి. మన మార్కెట్లో ధరలు కొంచెం అధికంగా ఉండొచ్చు. 

ఇక రియల్ మీ జీటీ 3 స్మార్ట్ ఫోన్ లో ఎన్నో విశేషాలు వున్నాయి. 6.7 అంగుళాల 2కే డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 1,000 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేటు, ఆక్టాకోర్ మీడియా టెక్ డైమన్సిటీ 8100 ప్రాసెసర్, 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, వెనుక భాగంలో 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్.. ఇలా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. 80 వాట్ ఫాస్ట్ చార్జర్ వేరియంట్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే, 150వ వాట్ చార్జింగ్ సపోర్ట్ చేసే వేరియంట్ లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.  

More Telugu News