Kodali Nani: పశువుల కొట్టంలో పడుకున్న కొడాలి నాని.. వైరల్ అవుతున్న ఫొటో!

Photo of Kodali Nani taking rest in cattle barn is going viral
  • మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొడాలి నానికి దక్కని అవకాశం
  • కేవలం ఇంటికే పరిమితమవుతున్న నాని
  • వ్యక్తిగత పనులు చూసుకుంటున్న మాజీ మంత్రి

మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పశువుల కొట్టంలో మంచంపై ఆయన సేద తీరుతున్న ఫొటోను నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొడాలి నానికి మళ్లీ స్థానం దక్కుతుందని చాలా మంది భావించారు. అయితే, అంచనాలకు భిన్నంగా రెండో సారి అవకాశాన్ని ఆయనకు సీఎం ఇవ్వలేదు.

 ఇదే సమయంలో... కేబినెట్ హోదా కలిగిన ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, దానికి ఛైర్మన్ చేస్తానని జగన్ చెప్పారు. మరోవైపు మంత్రి పదవి పోయినప్పటి నుంచి కొడాలి నాని పెద్దగా బయట కనిపించడం లేదు. ఇంటికే పరిమితమవుతున్నారు. ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో, మంత్రి పదవి తనకు అవసరం లేదని, పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పిన ఆయన... అంత యాక్టివ్ గా కనిపించడం లేదని నెటిజెన్లు అంటున్నారు.
Kodali Nani
Cattle Barn
Rest
YSRCP

More Telugu News