సిరుత పులుల సిందాట... ఆచార్య నుంచి 'భలే భలే బంజారా' పాట ప్రోమో విడుదల

Bhale Bhale Banjara song promo out now
  • ఇప్పటికే పాట టీజర్ విడుదల
  • వైరల్ గా చిరంజీవి, రామ్ చరణ్ సంభాషణ
  • తాజాగా గ్లింప్స్ వీడియో పంచుకున్న చిత్రబృందం
  • రేపు సాయంత్రం 4.05 గంటలకు పూర్తి పాట రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న 'ఆచార్య' చిత్రం నుంచి 'భలే భలే బంజారా' అనే గీతం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ ల సంభాషణతో కూడిన టీజర్ వీడియో రిలీజ్ చేసిన చిత్రబృందం... తాజాగా ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియో పంచుకుంది. 

'సిరుత పులుల సిందాట' అంటూ సాగే 'భలే భలే బంజారా' గీతం ప్రోమో వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ సోషల్ మీడియాలో పంచుకుంది. పూర్తి పాటను రేపు (ఏప్రిల్ 18) సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. కాగా, 'భలే భలే బంజారా' గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు.
Go Back to Shorts
Bhale Bhale Banjara
Promo
Acharya
Chiranjeevi
Ramcharan

More Telugu News