నెల్లూరు కోర్టులో చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశాం: ఎస్పీ విజయరావు
- గతంలో కాకాణిపై సోమిరెడ్డి కేసు
- నెల్లూరు కోర్టులో చోరీ
- సోమిరెడ్డి కేసు పత్రాలు మాయం!
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బెంచ్ క్లర్క్
- ఆత్మకూరు బస్టాండు వద్ద నిందితుల అరెస్ట్
నిందితుల పేర్లు సయ్యద్ హయత్, ఖాజా రసూల్ అని తెలిపారు. వారిద్దరిపై 14 పాత కేసులు ఉన్నాయని వివరించారు. వారిని నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండు వద్ద అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఒక ల్యాప్ టాప్, ట్యాబ్, 4 సెల్ ఫోన్లు, 7 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ విజయరావు వివరించారు.