విష్వక్సేన్ పెద్ద సాహసమే చేస్తున్నాడే!
- కొత్త కంటెంట్ తో వస్తున్న విష్వక్సేన్
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- దర్శకుడిగా విద్యాసాగర్ పరిచయం
- ఈ నెల 22 నుంచి 30వ తేదీకి వాయిదా
బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించాడు. ఇది గ్రామీణ నేపథ్యంలో రూపొందిన కథ. లవ్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టయినర్. ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేయవలసి ఉంది. కానీ తాజాగా ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.
నిజానికి ఈ నెల 22వ తేదీ విడుదలకి మంచి సమయమే. అప్పటికి తెలుగు రాష్ట్రాల్లో 'కేజీఎఫ్ 2' ఉద్ధృతి తగ్గుతుంది. అలా కాకుండా ఈ సినిమాను తీసుకెళ్లి 30వ తేదీలో వేశారు. అంతకుముందు రోజే 'ఆచార్య' విడుదలవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి సినిమా తరువాత రోజునే బరిలోకి దిగడమంటే అది విష్వక్ సేన్ చేస్తున్న సాహసమే అవుతుంది.