బొజ్జ‌ల‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన చంద్ర‌బాబు!

tdp chief chandrababu surprises bojjala gopalakrishna reddy
  • నేడు మాజీమంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి బ‌ర్త్ డే
  • బ‌ర్త్‌డే విషెస్ చెప్పేందుకు బొజ్జ‌ల ఇంటికి చంద్ర‌బాబు
  • స్వ‌యంగా కేక్ క‌ట్ చేయించిన వైనం
  • ఆనందంలో తేలియాడిన బొజ్జ‌ల‌
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పార్టీకి చెందిన సీనియర్ నేత‌, మాజీ మంత్రి  బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డిని స‌ర్‌ప్రైజ్ చేశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న బొజ్జ‌ల హైద‌రాబాద్‌లోని త‌న ఇంటిలోనే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం పాలైన‌ ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఈ మధ్యనే ఆరోగ్యం కాస్తంత‌ కుదుట పడగా ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. 

ఇక నేడు (ఏప్రిల్ 15) బొజ్జ‌ల పుట్టిన రోజు. ఈ విష‌యాన్ని గుర్తు చేసుకున్న చంద్ర‌బాబు.. శుక్ర‌వారం సాయంత్రం నేరుగా బొజ్జ‌ల ఇంటికి వెళ్లారు. స‌డెన్‌గా చంద్ర‌బాబు త‌మ నివాసానికి రావ‌డం చూసిన బొజ్జ‌ల కుటుంబ స‌భ్యులు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు. బొజ్జ‌లకు బ‌ర్త్ డే విషెస్ చెప్పేందుకే తాను వ‌చ్చాన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. కుర్చీకే ప‌రిమితం అయిన బొజ్జ‌ల‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

అంతేకాకుండా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో బొజ్జ‌ల‌తో చంద్ర‌బాబు కేక్ క‌ట్ చేయించారు. ఆ త‌ర్వాత కాసేపు బొజ్జ‌ల ప‌క్క‌నే కూర్చుని మాట్లాడారు. త‌న ఇంటిలో చంద్ర‌బాబును.. అదీ త‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌డానికి వ‌చ్చిన చంద్ర‌బాబును చూసి బొజ్జ‌ల ఆనందంతో పొంగిపోయారు.
Go Back to Shorts
TDP
Chandrababu
Bojjala Gopala Krishna Reddy

More Telugu News