BJP: వైసీపీపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ నేత స‌త్య‌కుమార్‌

bjp leader satya kumar harsh comments on ysrcp
  • అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అన్న సత్యకుమార్ 
  • వైసీపీకి బీజేపీ నుంచి ఎలాంటి స‌హ‌కారం ఉండ‌దని వ్యాఖ్య 
  • అమ‌రావ‌తిలోనే ఏపీ రాజ‌ధాని కొన‌సాగుతుంద‌న్న బీజేపీ నేత ‌
వైసీపీపై బీజేపీకి చెందిన కీల‌క నేత స‌త్య‌కుమార్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అవినీతి నుంచి వైసీపీ పుట్టింద‌న్న స‌త్య‌కుమార్‌..  అవినీతి, కులం ప్రాతిపదిక‌గా వచ్చిన వైసీపీకి బీజేపీ నుంచి ఎలాంటి స‌హ‌కారం ఉండ‌ద‌ని అన్నారు. అస‌లు వైసీపీకి, బీజేపీకి పొంత‌నే లేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా గురువారం నందిగామ‌లో అంబేద్కర్ విగ్ర‌హానికి నివాళి అర్పించిన సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఇక ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై స‌త్య‌కుమార్‌ మాఅట్లాడుతూ.. ఏపీకి రాజ‌ధానిగా అమ‌రావ‌తే కొన‌సాగుతుంద‌ని చెప్పారు. అమ‌రావ‌తికి బీజేపీ నుంచి పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. అందులో భాగంగానే అమ‌రావ‌తిలో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌కు చెందిన కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు.

More Telugu News

BJP
Satya Kumar
Amaravati
Ambedkar Jayanthi
YSRCP