కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై రాళ్లదాడి.. కారు ధ్వంసం
- హైదరాబాద్ అంబర్‌పేటలోని వీహెచ్ ఇంటిపై దాడి
- పీసీసీ చీఫ్‌గా, ఎంపీగా పనిచేసిన తనకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేసిన తనకే రక్షణ లేకుండా పోయిందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.