గంజాయి కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. దోషికి 20 ఏళ్ల శిక్ష
- 2020లో 1,427 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడిన నదీమ్
- తాజాగా తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం
- లక్ష రూపాయల జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో మూడేళ్ల జైలు
ఈ కేసులో ఆ తర్వాతి రోజు నిందితుడైన వాహనం డ్రైవర్ నదీమ్ (25)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అరెస్ట్ చేసింది. తాజాగా ఈ కేసులో నదీమ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో మూడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.