చిత్తూరు జిల్లాపై ప్రత్యేక అభిమానాన్ని చూపిన జగన్!

Jagan shown special interest on Chittoor Dist
  • కొత్త కేబినెట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురుకి అవకాశం
  • పాత మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామిల కొనసాగింపు
  • కొత్తగా రోజాకు అవకాశం కల్పించిన జగన్
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అగ్రతాంబూలం లభించింది. ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు జిల్లాపై తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కొత్తగా కొలువుదీరనున్న కేబినెట్లో అత్యధిక మంత్రులు ఈ జిల్లాకు చెందిన వారే. పాత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలను కొనసాగించిన ముఖ్యమంత్రి... ఈ విడతలో నగరి ఎమ్మెల్యే రోజాకు కూడా అవకాశం ఇచ్చారు. దీంతో, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రుల సంఖ్య మూడుకు పెరిగింది.

ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. స్వీట్లు పంచుతూ, బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పని చేసిన నారాయణస్వామికి ఈసారి కూడా అదే పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
Jagan
Chittoor District
3 Ministers
Roja
Peddireddi Ramachandra Reddy
K Narayana Swamy
YSRCP

More Telugu News