Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి హ్యాట్రిక్

  • కేరళలోని కన్నూర్ లో సీపీఎం మహాసభలు
  • నేటితో ముగిసిన సభలు
  • చివరి రోజున ప్రధాన కార్యదర్శి ఎన్నిక 
  • మూడోసారి ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి
Sitaram Yechury elected as CPM General Secretary for the third time in a row

కేరళలోని కన్నూర్ లో సీపీఎం మహాసభలు నేటితో ముగిశాయి. 23వ ఆలిండియా మహాసభల చివరి రోజు సీపీఎం ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి తొలిసారి 2015లో పార్టీ పగ్గాలు అందుకున్నారు. 

17 మందితో కూడిన కీలక పొలిట్ బ్యూరోను కూడా ఈ సభలోనే ఎన్నుకున్నారు. పొలిట్ బ్యూరోలో తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు ఒక్కరికే ప్రాతినిధ్యం లభించింది. 

అటు, 85 మందితో కూడిన కేంద్ర కమిటీని కూడా ఈ మహాసభలోనే ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, నాగయ్య, అరుణ్ కుమార్, వెంకట్, సీతారాములుకు కేంద్ర కమిటీలో స్థానం కల్పించారు. ఏపీ నుంచి బీవీ రాఘవులు, శ్రీనివాసరావు, పుణ్యవతి, గపూర్ లకు చోటిచ్చారు.

More Telugu News