Shehbaz Sharif: ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోబోము.. చట్టం తనపని తాను చేస్తుంది: పాక్ కాబోయే కొత్త ప్రధాని షరీఫ్

Will not take revenge law will take its course Shehbaz Sharif
  • పాక్ పెద్ద సంక్షోభాన్ని గట్టెక్కింది
  • కొత్త ఉదయానికి స్వాగతం
  • ఎవరికీ అన్యాయం చేయం
  • ట్విట్టర్లో స్పందించిన షబాజ్ షరీఫ్
ఇమ్రాన్ సర్కారు కూలిపోవడంతో ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ చీఫ్ షెబాజ్ షరీఫ్ పాకిస్థాన్ తదుపరి ప్రధాని కానున్నారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత షెబాజ్ ట్విట్టర్ ద్వారా పాక్ ప్రజలకు సందేశం ఇచ్చారు. పెద్ద సంక్షోభాన్ని పాకిస్థాన్ గట్టెక్కినట్టు చెప్పారు. కొత్త ఉదయానికి స్వాగతం పలుకుతున్నట్టు ప్రకటించారు.

‘‘ఎవరిపైనా మేము ప్రతీకారం తీర్చుకోబోము. ఎవరికీ అన్యాయం చేయబోము. అలాగే, ఎవరినీ జైల్లో పెట్టం. కానీ చట్టం మాత్రం తనపని తాను చేస్తుంది’’అని షెబాజ్ అన్నారు. ఏప్రిల్ 11న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు పాకిస్థాన్ పార్లమెంటు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా సమావేశం కానుంది. పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాసం ద్వారా అధికారం కోల్పోయిన మొదటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కావడం గమనార్హం.
Shehbaz Sharif
Pakistan
new pm face
revenge
crisis

More Telugu News