Tamilnadu: పాడెపై శవంలా ఆలయానికి వచ్చి మొక్కు తీర్చుకున్న భక్తుడు!

A devotee acted as dead man and visits jarikondalampatti temple in salem
  • తమిళనాడులోని సేలం జిల్లాలో ఘటన
  • అంతిమయాత్రలో పాల్గొన్న బంధువులు, కుటుంబ సభ్యులు
  • శ్మశానానికి తీసుకెళ్లి కోడిని పూడ్చి పెట్టిన వైనం
  • అక్కడి నుంచి నేరుగా అమ్మవారి ఆలయానికి
పాడెపై శవంలా వచ్చిన ఓ భక్తుడు అమ్మవారి మొక్కు తీర్చుకున్నాడు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది. జిల్లాలోని జారికొండలాంపట్టి మారియమ్మన్ కాళియమ్మన్ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ భక్తుడు శవంలా వేషం ధరించి అమ్మవారి మొక్కు తీర్చుకున్నాడు. తొలుత కొండలాంపట్టిలోని బస్టాండ్‌లో పందిరి వేసి భక్తుడికి శవానికి చేసే అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. 

అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి అంతిమయాత్ర నిర్వహించారు. పాడెపై ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్లారు. వెంట తీసుకెళ్లిన కోడిని పూడ్చిపెట్టి అక్కడి నుంచి నేరుగా ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పాడెపై నుంచే భక్తుడు అమ్మవారిని దర్శించుకున్నాడు. విచిత్రంగా జరిగిన ఈ మొక్కు చెల్లింపును చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Tamilnadu
Selam
Jarikondalampatti
Temple

More Telugu News