Karnataka: ప్రేమ పేరుతో బాలికకు వల.. అత్యాచారం చేసి మిత్రులకూ అప్పగించిన యువకుడు!

6 men Raped minor girl in bengaluru yelahanka
  • బెంగళూరు శివారులోని యలహంకలో ఘటన
  • బాలికపై అత్యాచారం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
  • దానిని బాధితురాలికి  పంపి బెదిరింపు
  • నిందితుల్లో ఇద్దరు బాలురు
ప్రేమ పేరిట ఓ బాలికకు వల వేసిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై తన మిత్రులకూ ఆమెను అప్పగించాడు. ఈ దారుణ ఘటన బెంగళూరు శివారులోని యలహంకలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. 15 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నట్టు నమ్మించిన 25 ఏళ్ల యువకుడు మాట్లాడాలంటూ యలహంకలోని ఓ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న నిందితుడి స్నేహితుడు ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. 

ఆ తర్వాతి రోజు ఆ వీడియోను బాధిత బాలికకు పంపి తన స్నేహితులకు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. లేదంటే వీడియోను బయటపెడతానని హెచ్చరించాడు. దీంతో భయపడిన బాలిక కొంత డబ్బు సేకరించి వారికి అందించింది. డబ్బులు తీసుకున్న వారు అక్కడితో వదిలిపెట్టకుండా వారం రోజులపాటు ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్న కుమార్తెను గమనించిన తల్లిదండ్రులు విషయం ఏంటని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేగంగా స్పందించారు. నిన్న ఉదయానికి నిందితులైన ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు బాలురు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Karnataka
Bengaluru
Yelahanka
Crime News

More Telugu News