మళ్లీ లాభాల్లోకి విశాఖ ఉక్కు... ఆరేళ్ల త‌ర్వాత లాభాల్లోకి సంస్థ‌

vizag steel into profits again
  • ఆరేళ్లుగా న‌ష్టాల్లోనే విశాఖ ఉక్కు
  • మార్చితో ముగిసిన ఈ ఏడాదిలో లాభాల బాట‌లోకి
  • రూ.835 కోట్ల లాభాన్ని ప్ర‌క‌టించిన సీఎండీ
విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట‌లోకి వ‌చ్చేసింది. ఆరేళ్లుగా ఏటా న‌ష్టాలనే చ‌విచూస్తూ సాగుతున్న కంపెనీ..  2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో తిరిగి లాభాల్లోకి వచ్చింది. ఈ మేర‌కు సంస్థ సీఎండీ అతుల్ భ‌ట్ శ‌నివారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఏడాది సంస్థ రూ.835 కోట్ల మేర లాభం (ప‌న్ను చెల్లింపున‌కు ముందు) ఆర్జించింద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. 

ఈ ఏడాది ఏకంగా 57 శాతం మేర అధిక ఉత్ప‌త్తిని సాధించిన విశాఖ ఉక్కు.. రూ.28,245 కోట్ల విలువైన అమ్మ‌కాల‌ను న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. రికార్డు స్థాయిలో పెరిగిన విక్ర‌యాలే కంపెనీకి లాభాల‌ను తెచ్చి పెట్టాయ‌ని అతుల్ భ‌ట్ తెలిపారు.
Go Back to Shorts
Vizag
Vizag Steel Plant
RINL

More Telugu News