cholesterol: కొలెస్ట్రాల్ ఎక్కువైతే మధుమేహం రిస్క్!

  • 80 శాతం కొత్త మధుమేహం కేసుల్లో చెడు కొలెస్ట్రాల్
  • తక్కువగా మంచి కొలెస్ట్రాల్
  • ఇండియన్ డయాబెటిక్ స్టడీలో వెల్లడి
  • కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని వైద్యుల సూచన
cholesterol leads Diabetes found new study

ఆహారాన్ని పరిమితికి మించి తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారంలో నియంత్రణ అవసరం. లేదంటే అధిక కొలెస్ట్రాల్ కు దారితీస్తుంది. 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టుకోవాల్సిందే. అదేమి చేస్తుందిలే? అన్న నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ దీర్ఘకాలం పాటు ఉంటే టైప్2 మధుమేహం బారిన పడొచ్చంటూ తాజా పరిశోధన ఒకటి హెచ్చరిస్తోంది. 

మధుమేహం బారిన పడుతున్న వారిలో 80 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్ ఉంటున్నట్టు ఇండియన్ డయాబెటిస్ స్టడీ తన తాజా అధ్యయనంలో గుర్తించింది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 5 వేల మందిపై ఈ అధ్యయనం జరిగింది. మధుమేహుల్లో మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్ డీఎల్ తక్కువగాను, చెడు కొలెస్ట్రాల్ ఎల్ డీఎల్ ఎక్కువగానూ ఉంటున్నట్టు తెలిసింది. 

అధికంగా ఉండే ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ వల్ల మధుమేహంతోపాటు, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో మార్పులు, శారీరక వ్యాయామాలు చేయాలని.. అవసరమైతే వైద్యుల సాయంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

More Telugu News