ఏపీలో తస్మదీయులు ప్రజలకి ఒక కర్ర ఇస్తే దానితో ఫ్యాన్ తిప్పుకుంటారు: నాగబాబు ఎద్దేవా
- ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై నాగబాబు చురకలు
- ఏపీలో విద్యుత్ కోతలకు ఫ్యాన్ తిరగటం లేదని విమర్శ
- ఫ్యాన్ తిరక్కపోతే తస్మదీయులకు కూడా ఇబ్బందే అని ఎద్దేవా
కాగా, టీ టైం అవుట్ లెట్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేనలో చేరారని నాగబాబు చెప్పారు. 'తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, టీ టైం అవుట్ లెట్ వ్యవస్థాపకుడు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 17 రాష్ట్రాల్లో 3 వేల టీదుకాణాలు స్థాపించి 20 వేలమందికి పైగా ఉపాధి కల్పించారు. ఏ రాజకీయశక్తులకు తలొగ్గకుండా జనంకోసం పనిచేస్తున్న జనసేనలో చేరడం జన సైనికులకు స్ఫూర్తినిచ్చే అంశం' అని నాగబాబు పేర్కొన్నారు.