వెండి తెరపై వెలగాలని ఓ కుర్రాడు వచ్చాడు.. ఇంతలో కాలం చక్రం తిప్పింది: చిరంజీవి
- 'గాడ్ ఫాదర్' చిత్రంలో ఓ పాత్రను పోషిస్తున్న పూరి జగన్నాథ్
- ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన చిరంజీవి
- పూరి జగన్నాథ్ మొదటి కల అలా మిగిలిపోకూడదని వ్యాఖ్య
ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ కూడా ఓ పాత్రను పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. 'నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు వెండితెర పైన నటుడిగా వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ, అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా. అందుకే నా పూరి జగన్నాథ్ ను ఒక ప్రత్యేక పాత్రలో ఇంట్రడ్యూస్ చేస్తున్నా' అని ట్వీట్ చేశారు. 'గాడ్ ఫాదర్' సెట్స్ లో దిగిన ఫొటోను షేర్ కూడా చేశారు.