Liam Livingstone: లివింగ్ స్టోన్ మళ్లీ వీరబాదుడు... పంజాబ్ భారీ స్కోరు

Liam Livingstone smashes Gujarat bowling as Punjab Kings registered huge total
  • సూపర్ ఫామ్ లో ఉన్న లివింగ్ స్టోన్
  • 27 బంతుల్లో 64 పరుగులు
  • 7 ఫోర్లు, 4 సిక్సులు బాదిన వైనం
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 రన్స్ చేసిన పంజాబ్
ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ లివింగ్ స్టోన్ ఐపీఎల్ లో సూపర్ ఫామ్ ప్రదర్శిస్తున్నాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో 32 బంతుల్లోనే 60 పరుగులు చేసిన లివింగ్ స్టోన్... ఇవాళ గుజరాత్ టైటాన్స్ పైనా అదే తరహాలో విరుచుకుపడ్డాడు. దాంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు సాధించింది. లివింగ్ స్టోన్ కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలింగ్ ను ఊచకోత కోసిన లివింగ్ స్టోన్ 7 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. 

ఓపెనర్ శిఖర్ ధావన్ 35, జితేశ్ శర్మ 11 బంతుల్లో 23 పరుగులు చేశారు. ఆఖర్లో రాహుల్ చహర్ బ్యాట్ ఝుళిపించడంతో పంజాబ్ కు భారీ స్కోరు సాధ్యమైంది. చహర్ 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 3 వికెట్లు తీయగా, కొత్త కుర్రాడు దర్శన్ నల్కండే 2, మహ్మద్ షమీ 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.
Liam Livingstone
Punjab Kings
Gujarat Titans
IPL

More Telugu News