Telangana: 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

  • పరీక్షా సమయాన్ని పెంచిన ప్రభుత్వం
  • 2.45 గంటల నుంచి 3.15 గంటలకు పెంపు
  • ఛాయిస్ కూడా ఎక్కువగా ఉంటుందన్న మంత్రి సబిత  
10th class time increased in Telangana

తెలంగాణలో వచ్చే నెలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. గత రెండేళ్లుగా విద్యార్థులు కరోనా కారణంగా చాలా కోల్పోయారు. ఆన్ లైన్ తరగతులు కూడా విద్యార్థులకు చాలా ఇబ్బందులను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంటూ వస్తోంది. 

తాజాగా 10వ తరగతి విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షా సమయాన్ని మరో 30 నిమిషాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్షా సమయాన్ని... 3 గంటల 15 నిమిషాలకు పెంచింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 70 శాతం సిలబస్ నే అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఛాయిన్ కూడా ఎక్కువ ఇస్తున్నట్టు తెలిపారు. 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. 

More Telugu News