TRS: ధాన్యం కొనుగోళ్ల‌పై 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నిర‌స‌న‌

trs deeksha on 11th in delhi
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్ర‌మే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోనే ఈ ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం కూడా తెలంగాణ ప్ర‌జ‌లు కేంద్రం వైఖ‌రిని నిర‌సిస్తూ ఇళ్ల‌పై న‌ల్ల జెండాలు ఎగుర‌వేయాల‌ని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే ధ‌ర్నాకు దిగ‌నున్న‌ట్లుగా  టీఆర్ఎస్ నుంచి ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఢిల్లీలో ఈ నెల 11న నిర‌స‌న చేప‌ట్ట‌నున్న‌ట్టు టీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం వేదిక‌గా జ‌రిగే ఈ నిర‌స‌న దీక్ష‌కు సంబంధించిన స్థ‌లాన్ని పార్టీ ఎంపీలు శుక్ర‌వారం ప‌రిశీలించారు.
Go Back to Shorts
TRS
New Delhi
TRS Party Office

More Telugu News