Yanamala: అందుకే కీలుబొమ్మ మంత్రి వర్గాన్ని బలి పశువును చేస్తున్నట్లు కనిపిస్తోంది: యనమల

- పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యత్నాలన్న యనమల
- అవినీతి బురదను కడుక్కోవాలంటే ఈ రాజీనామాలు సరిపోవంటూ వ్యాఖ్య
- జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పి దిగిపోవాలని సూచన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు జరుపుతోందని అన్నారు. అందుకే కీలుబొమ్మ మంత్రి వర్గాన్ని బలి పశువును చేస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు.
మంత్రుల నుంచి సీఎం జగన్ ఎందుకు రాజీనామాలు కోరారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి బురదను కడుక్కోవాలంటే ఈ రాజీనామాలు సరిపోవని ఆయన అన్నారు. విధ్వంసక విధానాలు పాటిస్తోన్న జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.