Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఎస్సార్టీసీ ప్ర‌యాణికుల‌కు స‌జ్జ‌నార్ మ‌రో బంప‌రాఫ‌ర్‌

vc sajjannar bumper offer to tsrtc Travelers
  • టీఎస్సార్టీసీ బ‌స్సులో అనుభ‌వాల‌కు స‌జ్జనార్ పిలుపు
  • ఎంపిక చేసిన అనుభ‌వాలు పంపిన వారికి రివార్డులు
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా స‌జ్జ‌నార్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌
తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్సార్టీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి సంస్థ ఉన్న‌తి కోసం సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జ‌నార్ ప‌లు కీల‌క చ‌ర్య‌లకు శ్రీకారం చుట్టారు. టీఎస్సార్టీసీ బస్సుల్లో ప్ర‌యాణం సుర‌క్షిత‌మంటూ మొద‌లెట్టిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత సంస్థ బ‌స్సుల్లో ప‌లు సౌక‌ర్యాలు, బ‌స్టాండ్ల‌లో కీల‌క వ‌స‌తులు ఏర్పాటు చేస్తూ సాగుతున్నారు. అందులో భాగంగా టీఎస్సార్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించే వారికి గురువారం ఆయ‌న ఓ బంప‌రాఫర్ ప్ర‌క‌టించారు.

టీఎస్సార్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణించిన సంద‌ర్భంగా మీకు ఎదురైన అనుభ‌వాల‌ను చెప్పాల‌ని పిలుపునిచ్చిన స‌జ్జ‌నార్‌... ఎంపిక చేసిన వాటికి రివార్డులు ఇస్తామంటూ గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్‌ను పెట్టారు. ఈ పోస్ట్ ప్ర‌కారం.. టీఎస్సార్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేసిన వారు పంపే అనుభ‌వాల్లో నుంచి గుండెల‌కు హ‌త్తుకునేలా ఉన్న వాటిని పంపిన వారికి టీఎస్సార్టీసీ త‌ర‌ఫున రివార్డులు ప్ర‌క‌టిస్తార‌ట‌.
TSRTC
VC Sajjannar
TSRTC MD

More Telugu News