పదవులతో పాటు కాన్వాయ్‌లనూ వదిలేసిన ఏపీ మంత్రులు
- జగన్ ఆదేశాలతో మంత్రులంతా రాజీనామా
- ఇంటికెళ్లే సందర్భంగా కాన్వాయ్‌లను వదిలేసిన వైనం
- సొంత వాహనాల్లో బయలుదేరిన మంత్రులు
గురువారం మధ్యాహ్నం. మొదలైన కేబినెట్ భేటీలో సీఎం జగన్ ఆదేశించిన మరుక్షణమే కేబినెట్‌లోని 24 మంది తమ పదవులకు రాజీనామాలు చేసేశారు. ఈ రాజీనామా లేఖలను వారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించారు. ఆ తర్వాత కేబినెట్ భేటీ ముగియగా.. బయటకు వచ్చిన మంత్రులు..మంత్రి హోదాలో ప్రభుత్వం తమకు కేటాయించిన కాన్వాయ్ లను అక్కడే వదిలేసి సొంత వాహనాల్లో ఇళ్లకు వెళ్లిపోయారు. కేబినెట్ భేటీకి ముందే మంత్రులంతా తమ చాంబర్లను ఖాళీ చేసినట్టు సమాచారం.