వీరంగం వేసిన ఎంఐఎం కార్పొరేటర్ కు జైలుదారి చూపించిన పోలీసులు
- ముషీరాబాద్ ప్రాంతంలో ఘటన
- అర్ధరాత్రి హోటళ్లు తెరిచి ఉంచడంపై పోలీసుల అభ్యంతరం
- మా ఇష్టం అంటూ వార్నింగ్ ఇచ్చిన కార్పొరేటర్
- కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
- చంచల్ గూడ జైలుకు కార్పొరేటర్
దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇలాంటి జులుం నడవదంటూ ఘాటుగా స్పందించారు.
ఈ నేపథ్యంలో, ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దాంతో ఆ కార్పొరేటర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
అంతకుముందు, కార్పొరేటర్ గౌసుద్దీన్ స్పందిస్తూ, పోలీసులు అభ్యంతరకర పదజాలం వాడడం వల్లే తాను ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. గతంలో తానెప్పుడూ పోలీసులపై దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ముషీరాబాద్ ప్రాంతంలో పోలీసులు, అధికారులతో తానెంతో సన్నిహితంగా ఉంటానని తెలిపారు.