TDP: ప్ర‌జ‌ల‌కు కొవ్వొత్తి, అగ్గిపెట్టె, విస‌న‌క‌ర్ర పంపిణీ చేసిన నారా లోకేశ్

  • కొన‌సాగుతున్న టీడీపీ నిర‌స‌న‌లు
  • కొవ్వొత్తి, అగ్గిపెట్టెకు తోడైన విస‌న‌క‌ర్ర‌
  • మంగ‌ళ‌గిరిలో నారా లోకేశ్ నిర‌న‌స‌
nara lokesh agitation in mangalagiri over current charges hike

ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీల‌కు నిర‌స‌న‌గా విప‌క్ష టీడీపీ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తోంది. ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా ప్ర‌తి ఇంటికి కొవ్వొత్తి, అగ్గిపెట్టె పంపిణీ చేయాల‌ని ఇప్ప‌టికే పార్టీ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. పార్టీ ఆదేశాల మేర‌కు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేత‌లు ఇంటింటికీ తిరుగుతూ కొవ్వొత్తి, అగ్గిపెట్టెతో పాటు విస‌న‌క‌ర్ర‌ల‌ను కూడా అంద‌జేస్తున్నారు.

ఈ నిర‌స‌న‌ల్లో భాగంగా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ బుధ‌వారం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు గ్రామాల్లో ప‌ర్య‌టించిన లోకేశ్.. ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌జ‌ల‌కు కొవ్వొత్తి, అగ్గిపెట్టె, విస‌న‌క‌ర్ర‌ల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ఆయ‌న ముందుకు సాగారు.

More Telugu News