శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. మరింతగా దిగజారిన పరిస్థితి
- ప్రజల నిరసనలతో దిగొచ్చిన అధ్యక్షుడు
- గత అర్ధరాత్రి నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు అమల్లోకి
- నార్వే, ఇరాక్‌లోని రాయబార కార్యాలయాలు మూసివేస్తున్నట్టు ప్రకటన
మరోవైపు, దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండడంతో దిగొచ్చిన అధ్యక్షుడు దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని రద్దు చేశారు. గత అర్ధరాత్రి నుంచే ఉపసంహరణ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. కాగా, దేశంలో ఆర్థిక పరిస్థితి నానాటికి మరింతగా దిగజారుతోంది. విద్యుత్, పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటివి దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల ధరలు ప్రజలకు అందనంత దూరంలో ఉన్నాయి.
శ్రీలంక ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి నార్వే, ఇరాక్‌లోని తమ రాయబార కార్యాలయాలను, ఆస్ట్రేలియాలోని తమ కాన్సులేట్ జనరల్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో మందులకు కొరత ఏర్పడడంతో హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రభుత్వం ప్రకటించింది.